శాంతియుత ప్రపంచం నెలకొనాలి

 క్రిస్మస్ నేపథ్యంలో పోప్‌ ఫ్రాన్సిస్‌ వాటికన్‌ సిటీలో బుధవారం ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. సంక్షోభ దేశాల్లో శాంతి, సాధారణ పరిస్థితులు తిరిగి నెలకొనాలని ఆయన ఆకాంక్షించా రు. వెనెజులా, లెబనాన్‌, మధ్య ఐరోపాతోపాటు పలు ఆఫ్రికా దేశాల్లో సాయుధ ఘర్షణలపట్ల పోప్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 'మధ్య ఐరోపా, ప్రపంచంలోని పలు దేశాల్లో అంతర్యుద్ధం, ఘర్షణల కారణంగా బాధపడుతున్న చాలా మంది చిన్నారుల జీవితాల్లో ప్రభువు వెలుగునింపాలని ప్రార్థిస్తున్నా' అని 83 ఏండ్ల వాటికన్‌ పీఠాధిపతి తన క్రిస్మస్‌ సందేశంలో పేర్కొన్నారు. పదేండ్లుగా అంతర్యుద్ధాలతో నలిగిపోతున్న ప్రియమైన సిరియా ప్రజలకు స్వస్థత చేకూరాలని పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆకాంక్షించారు.