క్రిస్మస్.. కేకులకు ఎందుకంత క్రేజీ ! వీడియో!

డిసెంబర్ వస్తూనే క్రిస్మస్ వచ్చేస్తోందనే శుభవార్తను కూడా మోసుకొచ్చింది. క్రిస్మస్ అంటేనే ఆనందాల పండుగ. ఏసుక్రీస్తు భూమిపై మానవుడిగా జన్మించిన శుభదినం. అన్నిటికంటే ముఖ్యంగా చిన్నాపెద్ద తేడా లేకుండా క్రిస్మస్ కేకును కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటారు. ఆ కేకు కోస్తే కానీ క్రిస్మస్ జరిపినట్లు కాదనే భావన దాదాపు అందరు క్రిస్టియన్లలో ఉంటుంది. అలాంటి కేకు రుచి మామూలు కేకులకు భిన్నంగా అద్భుతంగా ఉంటుంది. క్రిస్మస్ కేకు తయారుచేయడం కూడా ఒక ప్రసిద్ధి చెందిన సాంప్రదాయంగా శతాబ్దాల నుండి కొనసాగుతోంది.స్మస్ సాధారణంగా అర్ధరాత్రి మాస్ గా ప్రారంభమవుతుంది. యేసు క్రీస్తు అర్ధరాత్రి సమయంలో పుట్టారంటారు.. కాబట్టి కిస్మస్ ప్రతి చర్చిలోను మిడ్ నైట్ మాస్ గా జరుగుతుంది. క్రిస్మస్ వస్తోందనగానే మనలో చాలామంది ఇళ్ళను ముందే అలంకరించుకోవటంలో బిజీగా ఉంటారు. క్రిస్టియన్లకి పెద్దరోజైన క్రిస్మస్ మొదలయ్యే నెల ముందు నుంచే ఈ హడావిడి మొదలవుతుంది. అలంకరణలో భాగంగానే నక్షత్రాలు, క్రిస్మస్ చెట్టు, బహుమతులు, ఇంకా ఇలాంటివి చాలానే తయారవుతూ ఉంటాయి.